ఒకప్పుడు ఒక రాజు ఉండిరి. ఆరాజు వద్ద మేలురకమైన ఒక గుర్రము ఉండెను. ఒకసారి రాజు తన గుర్రంపై రాజ్యంలో షికారు చేయడానికి బయలుదేరారు. గుర్రంపై వెళ్తున్న రాజుగారిని చూడడానికి రాజ్యంలోని ప్రజలు రాజమార్గానికి ఇరువైపులా నిలబడ్డారు. రాజుగారు గుర్రంపై వస్తుండగా జనం వంగి వంగి నమస్కారం చేయసాగిరి. రాజుగారు పట్టణంలోని ఇంకోవైపుకు వెళ్ళగానే గుర్రం అనుకోకుండా ఆగిపోయింది. రాజుగారు అనేక విధాలుగా ప్రయత్నం చేసినా ఆగుర్రం కొద్దిగా కూడా కదలలేదు, రాజుగారు చర్నాకోలతో కొట్టినడిపే ప్రయత్నం చేసినా కూడా ఆ గుర్రం కదలకుండా సిలబడిపోయింది. చివరికి రాజుగారు విసిగిపోయి గుర్రాన్ని ఇలా అడిగారు – ” ఏమిటి విషయం, నీవు ఎందుకు ముందుకు కదలడం లేదు?” అని! గుర్రానికి రాజుగారి భాష, తెలిసేది, రాజుగారికి కూడా గుర్రం భాష, అర్థమయ్యేది. గుర్రం రాజుగారితో మీరు ముందుగా నా వీపుపై నుండి దిగండి చెపుతాను అంది. రాజు గుర్రంపై నుండి దిగగానే గుర్రం ఇలా అంది – “ఈ రోజు నుండి మీరు నాపై సవారి చేయకూడదు” అని. రాజుగారికి గుర్రం మాటలు విని ఆశ్చర్యం కలిగి – “ఎందుకు, ఏమయింది?” అని అడిగారు. గుర్రం చిరాకు పడి “చూశారు కదా, నగరంలోని జనం వంగి వంగి నాకు ఎలా నమస్కారం చేయసాగారో, నగరంలోని జనం నన్ను ఇంత గౌరవిస్తుంటే, వారి ముందు మీరునాపై సవారి చేస్తే నా మర్యాద మట్టిలో కలిసిపోతుంది. అందుకని ఈ రోజు నుండి మీరు నాపై సవారి చేయకూడదు” అన్న గురం యొక్క ఈ మాటలు విని రాజగారు విచారంగా ఉండిపోయారు.

ఈ శరీరం గుర్రం. ‘దానిపై ఆత్మ రాజు వలె సవారి చేస్తుంది. మనం అనుభవించే మర్యాద, సన్మానం, యశస్సు, కీర్తి, వైభవం, సమృద్ధి మొదలైనవన్నీ ఆత్మ చైతన్యం కారణంగా కలుగుతాయి.కానీ దేహం-మనస్సు-బుద్ధి యొక్క సమూహానికి ఈ మర్యాద, సన్మానం, యశస్సు, కీర్తి, వైభవం, సమృద్ధి మొదలైనవన్నీ నా వల్లనే అనే భ్రమ కలుగుతుంది. అందువల్లనే దేహం మొదలైన ఆనాత్మ సమూహం కూడా రాజు యొక్క గుర్రం వలె వ్యర్థ అభిమానంతో కూడి ఉంటుంది. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి ఉపదేశిస్తూ ఇలా చెప్పారు – “ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు బుద్ధిం తు సారథిం విద్ధి మన: ప్రగ్రహమేవ చ| ఇంద్రియాణి హయానాహు: విషయాస్తేషు గోచరాన్ | ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తే త్యాహుర్మనీషిణః” జీవాత్మ రథానికి స్వామి అయి ఉన్నది, ఈ శరీరం రథం అయి ఉన్నది, బుద్ధి ఈ రథానికి సారథి మరియు మనస్సు కళ్లేము అని తెలుసుకో. ఇంద్రియాలే గుర్రం మరియు ఇంద్రియ గోచర విషయాలేవాటి మార్గం, దానిపైనే ఇంద్రియరూప గుర్రం పరిగెత్తుతుంది. శరీరం, ఇంద్రియాలు మరియు మనస్సుతో కూడిన జీవాత్మనే విద్వజ్జనులు భోక్తా అంటారు.

ఇంద్రియాల దుష్ట ఆశ్వానికి మనస్సు అనే కళ్లెంతో బుద్ధి ఎప్పుడేతే తన వశం చేసుకుంటుందో అప్పుడే ఈ శరీర రూప రథం సరైన దిశలో – నడుస్తుంది, లేకపోతే దుర్ఘటన నిశ్చయం. ఇంద్రియ రూప గుర్రం ఒక వేళ స్వతంత్రంగా వ్యవహరిస్తే రథం మరియు సారథి ఇద్దరూ గుంతలోకెళ్ళి పడతారు. అందువల్ల మనం మన ఇంద్రియాలను బుద్ధిరూపసారథికి అప్పగించాల్సిన ఆవశ్యకత ఉంది. దీంతో పాటు మనం గుర్తుంచుకోవలిసిన విషయం ఏమిటంటే నేను రథాన్ని కాదు, నేను సారథిని కాదు, నేను కళ్ళాన్ని కాదు మరియు గుర్రం కూడా కాదు.నేను వీటన్నిటి స్వామి అయిన ఆత్మరూప రథాన్ని అని. అందువల్ల నేను ఇంతకు ముందు ఒక కవితలో (గజల్) ఇలా వ్రాశాను – “జో బీ హి ఆన్ బాన్ శాన్ జ్ఞాన్ కీయహా| వాకయీ మే హైవో ఆపకీ బందా గరీబ్ హై” జడశరీరం మరియు చేతన ఆత్మ యొక్క ఈ వివేకం మీ అందరికి ప్రభు కృపతో ప్రాప్తించాలని, మంగళ ఆశీస్సులు ఇస్తున్నాను.

[social_warfare]