२० ऑगस्ट १९६५ को लिया गया चित्र

 

శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు అనుగ్రహం పొందిన రోజు

విశ్వవసు నామ సంవత్సరం – శ్రావణ కృష్ణ అష్టమి,

శుక్రవారం 20 అగష్టు 1965

 

 శ్రీ కృష్ణ జన్మాష్టమికి శ్రీ సంస్థాన చరిత్రలోను శ్రీ సద్గురు సిద్ధరాజ్ మాణిక్ ప్రభు మహారాజుగారి జీవితంలోను ఒక ప్రత్యేకమైన మహత్యం ఉంది. ఈ రోజుకు సరిగ్గా 55 సంవత్సరాలకు పూర్వం జన్మాష్టమి నాడు జరిగిన ఒక అద్భుత సన్నివేశాన్ని తెలియజేస్తున్నాము. ఇది ప్రభుమహారాజ్ గారి శక్తిని, సద్గురువు మహిమయే కాక భక్తుని సామర్థ్యాన్ని కూడా తెలియజేసే ఒక అద్భుతమైన సంఘటన. అందువల్ల ఎవరి హృదయంలో భక్తితో కూడిన శ్రద్ధాసక్తులు ఉంటాయో వారు మాత్రమే ఈ కథను అర్థం చేసుకోగలరు. ఈ సంఘటన 1965 వ సంవత్సరంలో శ్రీ ప్రభువు యొక్క మహిమాన్విత గాదీపై శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు మహారాజుగారు  పీఠాధిపతులై ఉన్నప్పుడు జరిగినది. 1945వ సంవత్సరంలో శ్రీ శంకర్ మాణిక్ ప్రభు మహారాజ్ గారి సమాధి అయిన తరువాత 6 సంవత్సరాల వయస్సులోనే శ్రీ సిద్ధరాజ్ ప్రభుగారు శ్రీ సంస్థాన కార్యభారాన్ని తమ కోమలమైన హస్తాల్లోకి తీసుకున్నారు. ప్రస్తుత శ్రీ సంస్థానం యొక్క భవ్యమైన రూపం ఆ కోమలమైన చేతుల సామర్థ్యం యొక్క అద్భుత పరిణామమే. కేవలం 6 సంవత్సరాల వయస్సు లోనే ఏ విధమైన విధివిధానాలతో మంత్రదీక్షా, ఉపనయనం తమ తండ్రి (సద్గురువు) అయిన శ్రీశంకరమాణిక్ ప్రభువుల సమక్షంలో జరగలేదు. అలాంటి విపత్కర పరిస్థితులలో శ్రీజీగారు పీఠాధిపతులయ్యారు.

1965 వ సంవత్సరంలో శ్రావణ మాస మహోత్సవం మాణిక్ నగర్ లో ఉత్సాహంతో జరుపబడుతున్నది. ప్రతిరోజు శ్రీజీగారు శ్రీ ప్రభుమందిరంలో రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, సకలదేవతా దర్శనం, నిత్య భజన మొదలైన కార్యక్రమాల తరువాత ఇంటికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించేవారు. సాయం సంధ్యలో ప్రదోష పూజ తరువాత భోజనం పూర్తవడానికి ఒక్కోసారి రాత్రి 11-12 గంటలు అయ్యేది. శ్రీ కృష్ణ జన్మాష్టమి ముందురోజు రాత్రి శ్రీజీగారు ప్రదోష పూజ ముగించి భోజనం తరువాత తమ గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. మరుసటి రోజు అంటే శుక్రవారం 20 ఆగష్టు 1965 శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మ ముహుర్తంలో శ్రీజీ గారికి స్వప్నంలో శ్రీ శంకర్ మాణిక్ ప్రభు సాక్షాత్కరించి చెవులలో గురుమంత్రం ఉపదేశించారు. అక్కడితో ఆ స్వప్నం పూర్తయింది.

తేణే దయాలుత్వ ప్రగటవిలే | శ్రీ హస్త మస్తకీ ఠెవిలే|

గుహ్య జ్ఞాన ఉపదేశిలే | యా నిజ దాసా||

 ఆకాశంలో తూర్పున సూర్యోదయమవుతందనే సంకేతం ఇచ్చే ఎర్రని రంగు పరచుకున్నది. మాణిక్ నగర్ ఇంకా నిద్రావస్థలోనే ఉంది. కానీ శ్రీజీగారు సూర్యోదయం కోసం చూడలేదు. ఎందుకంటే సద్గురువు కృపా కటాక్షం అనే సూర్యోదయం వారికి అయింది. ఆ దివ్యానుభూతిని పొందిన శ్రీజీగారు కొన్ని క్షణాలు పరమానందభరితులయ్యారు. ఆ మంత్ర శబ్దం శ్రీజీగారి చెవులలో గింగురుమనసాగింది. వెంటనే శ్రీజీగారు స్నాన సంధ్యాదులు ముగించుకొని అప్పుడు ప్రభువు పూజ చేసే అర్చకులైన స్వ. పురుషోత్తమ్ శాస్త్రి గారిని పిలిచి స్వప్న విషయాన్ని తెలియజేశారు. శ్రీ పురుషోత్తమ్ శాస్త్రి గారు శ్రీ భీమ్ భట్, శ్రీ దత్త దీక్షిత్, శ్రీ గోవింద్ దీక్షిత్ మొదలైన పండితులతో చర్చించి శ్రీజీగారికి స్వప్నంలో ఇచ్చిన మంత్రాన్ని శ్రీ శంకర్ మాణిక్ ప్రభు సమాధి సమక్షంలో శాస్త్రోక్తంగా స్వీకరించడానికి ఏర్పాటు చేశారు. శ్రీ ప్రభువు శ్రావణ మాస మహాపూజ ముగించి శ్రీజీగారు శ్రీ శంకర్ మాణిక్ ప్రభు మందిరానికి వెళ్ళి అక్కడ సమాధికి పూజ చేసి స్వప్నంలో ప్రాప్తించిన మంత్రాన్ని సమాధి ముందు పఠించి తరువాత విధియుక్తంగా స్వీకరించారు. ఈ విధంగా మహారాజుగారిని జన్మాష్టమి పర్వదినం రోజున సద్గురువు శ్రీ శంకర్ మాణిక్ ప్రభువు మహారాజుగారు గురుమంత్రంతో అనుగ్రహించారు.

భక్తునిలో ఉన్న శ్రేష్టమైన గుణానికి ప్రభావితమై భగవంతుడు కూడా భక్తుని కోసం అసంభవాన్ని కూడా సంభవం చేసే పరిస్థితులకు లోనవుతాడు. భగవంతుడు స్వయంగా “అహం భక్త పరాధీన:” అని చెప్పి ఈ విషయాన్ని స్పష్టపరిచారు. గురుకృప యొక్క ఈ కథ మన హృదయాన్ని పునీతం చేస్తూ నిష్కామ భక్తియే భగవత్ ప్రాప్తికి సర్వోత్తమ మార్గమనే సందేశాన్ని ఇస్తుంది మరియు మనం ఈ మార్గాన్ని నిష్కామ పూర్వకంగా అనుసరించాలి.

 

[social_warfare]